పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారు-గ‌డ్క‌రీ

0
105

ప‌శ్చిమ‌గోదావ‌రిః పోలవరం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు దేశానికే కీలక ప్రాజెక్టు అని,ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రైతులు కొత్త జీవితాన్ని ఇస్తుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.బుధ‌వారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ప్రాజెక్టు పనులను నితిన్‌ గడ్కరీ పరిశీలించారు.అనంతరం నితిన్‌గడ్కరీ,చంద్రబాబు సంయుక్తంగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ ఫిబ్రవరి నాటికి సివిల్‌ వర్క్స్‌ పూర్తి చేయాలని తాను సంబంధిత అధికారులకు సూచించానని అన్నారు.పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని,మరింత వేగం పెంచాలని కోరారు.పనులు పూర్తి చేసేందుకు కొన్నినిధులు ముందే చెల్లించాలని చంద్రబాబు కోరారని,భూసేకరణ,పరిహారం కోసం నిధులు ముందే చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి అవసరమన్నారు.నిధులు త్వరగా విడుదల చేసేలా ఆర్థిక శాఖను కోరతామని చెప్పారు.భూసేకరణ,పరిహారం ఖర్చుదాదాపు రెట్టింపు అయ్యిందని,పెరిగిన ప్రాజెక్టు అంచనాలను ఆర్థిక శాఖకు పంపిస్తామని,తాను పోలవరం రావడం ఇది రెండోసారి అని చెప్పారు.పోలవరం ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని గడ్కరీ స్పష్టం చేశారు.కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజులపాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించుకోవాలని,పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు.ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి వ్యాఖ్యానించారు.నిధుల ఆలస్యం కేవలం టెక్కికల్ సమస్యేనని,సీఎం చంద్రబాబు కోరినట్లు ముందుగానే నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.అభివృద్ధికి రాజకీయాలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు.ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ భూసేకరణ,ఆర్ఆర్‌ల అంచనాలు 2013-14 చట్టం ప్రకారం అంచనాలు పెరిగాయని వివరణ ఇచ్చారు.పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,200 కోట్ల బకాయిలను కేంద్ర సర్కారు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని చంద్రబాబు అన్నారు.ఇందులో భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2019 డిసెంబరు వరకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నామని అన్నారు.మీడియా సమావేశం అనంతరం పోలవరం అతిథి గృహంలో నితిన్‌గడ్కరీతో చంద్రబాబు సమావేశమయ్యారు.

LEAVE A REPLY