అమిత్‌షా కాన్వ‌య్‌పై రాళ్ల‌దాడి ప‌ట్ల బిజెపి నేత‌లు తీవ్ర ప్ర‌తిస్పంద‌న‌

0
165

మా పార్టీని ఎవ్వ‌రు ఏమిచేయ‌లేరు-చంద్ర‌బాబు
అమ‌రావ‌తిః రాష్ట్రనికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదంటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు తెలుపుతున్న స‌మ‌యంలో, రాష్ట్ర ప్ర‌జ‌లు బిజెపి ప‌ట్ల కొంత మీమాసంలో వున్న ప‌రిస్దితిలో శుక్ర‌వారం బిజెపి జాతీయ అధ్య‌క్ష‌డు అమిత్‌షా తిరుమ‌ల ప‌ర్యాట‌న స‌మ‌యంలో చోటు చేసుకున్న కాన్వ‌య్‌పై రాళ్ల దాడి సంఘ‌ట‌న కొత్త మ‌లుపు తిరుగ‌నున్న‌దా అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవుననేఅంటున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీప‌ట్ల బిజెపి అధ్య‌క్షుడుకి ఒకింత ఆస‌హ‌నం వున్న‌ప్ప‌టికి రాజకీయ అవ‌స‌రాల‌ను దృష్టిలో వుంచుకుని,జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతున్న స‌మయంలో,టిడిపి కార్య‌క‌ర్త‌ల దుందుడుకు చ‌ర్య‌ల‌తో,బిజెపి అధిష్ట‌నం రాబోయే రోజుల్లో టిడిపి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించేందుకు అస్కారం ఏర్పిడింది.జ‌రిగిన సంఘ‌ట‌న‌పై న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌ల్సిన టిడిపి అధినేత ఇందుకు విరుద్దంగ వ్య‌వ‌హ‌రించ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయల గురించి తెలిసిన వారు సైతం ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు.క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బిజెపి గెలిచిన‌,గెల‌వ‌క‌పోయిన‌,త‌న‌కు జ‌రిగిన అవ‌మానం ప‌ట్ల అమిత్‌షా స్పంద‌న‌కు,బిజెపి సినియ‌ర్ నాయ‌కులు సైతం సంపూర్ణంగా మ‌ద్దతు ఇస్తార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఈనేప‌థ్యంలో రాష్ట్రంలో సోమ‌వారం నుండి రాజకీయాల్లో నూత‌న స‌మీక‌ర‌ణ‌లు,రాజ‌కీయమైన విమ‌ర్శలు ప్రారంభం కానున్న‌య‌ని రాజకీయ ప‌రిశీలకు అంచ‌న వేస్తున్నారు.
అమిత్‌షా కాన్వ‌య్‌పై రాళ్ల దాడిః-శుక్ర‌వారం తిరుమలకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగ తగులగా, స్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఆయన వెళుతున్న కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్ల అద్దాలు పగిలాయి.అంతకుముందు అమిత్ షాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నినాదాలతో హోరెత్తిస్తూ,రోడ్డును స్తంభింపజేయగా,బీజేపీ శ్రేణులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు,సాధారణ ట్రాఫిక్ ను నిలిపివేశారు.అత్యంత పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు,ఆయన కాన్వాయ్ ని భద్రంగా రేణిగుంట ఎయిర్ పోర్టునకు చేర్చారు.
టిడిపి అధినేత చంద్ర‌బాబుః- కర్ణాటక ఎన్నికల తరువాత టీడీపీ సంగతి చూస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని, తాను ఏపీ ప్రజల తరఫున న్యాయం కోసం ప్రధానమంత్రిపై ముఖ్యమంత్రిగా పోరాడుతున్నానని అన్నారు.
మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూః- తమ కార్యకర్తలను బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారని,బీజేపీ నేతలు ఏపీపై చేస్తోన్న వ్యాఖ్యలను కర్ణాటక ప్రజలు కూడా గమనిస్తున్నారని,ఆ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.
ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పంద‌నః- ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి జరగడం దారుణమని, తిరుపతికి వచ్చే వారిని అతిథులుగా గౌరవించాలని,రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఇన్నాళ్లూ టీడీపీ అవినీతిలో మాత్రమే కూరుకుపోయిందనుకున్నాం కానీ, ఆ పార్టీ గూండాలతో నిండిపోయిందని ఇప్పుడు తెలిసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని, దేశం మొత్తం ఏపీని ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వ్యక్తిగత దాడులతో టీడీపీ ఏం చెప్పాలనుకుంటోంది ఆకుల సత్యనారాయణః– ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, అమిత్ షా కాన్వాయ్ పై దాడిని ఖండిస్తున్నామని అన్నారు.వ్యక్తిగత దాడులతో టీడీపీ ఏం చెప్పాలనుకుంటోందన్న విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వైఖరి ఏపీ ప్రజలు తలదించుకునేలా చేసిందని,ఈ దాడిని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు.

LEAVE A REPLY