త్రిపుర,నాగాలాండ్‌లో విజ‌యంపై బిజెపి నాయ‌కుల సంబరాలు

0
102

విశాఖపట్నంః త్రిపుర,నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాజపా కూటమి విజయం సాధించిన సందర్భంగా భాజపా నాయకులు సంబరాలు నిర్వహించారు.కమ్యూనిస్టుల‌ కంచుకోటగా ఉన్న త్రిపుర ఈసారి భాజాపా ఖాతాలోకి వెళ్లిపోయింది. గతంలో ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కని భాజపాకు ఈసారి స్పష్టమైన మెజార్టీని ఆ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు.ఈ విజయానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని పలువురు భాజపా నేతలు అభిప్రాయపడుతున్నారు.త్రిపురలో నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అవినీతి మచ్చ అంటని మాణిక్‌ సర్కార్ ప్రాభవాన్ని సైతం వెనక్కి నెట్టి భాజపా దూసుకుపోవడం గమనార్హం.సంబరాలలో భాజపా జాతీయ నాయకులు సతీష్ జీ, ఏపీ భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు,ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY