నాపై చెప్పుల దాడిని ఖండిస్తున్నా- 5 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధ‌నం చెప్పాలి-క‌న్నా

0
99

నెల్లూరుః కావలిలో తనపై చెప్పుతో దాడి చేయడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై జరిగిన చెప్పుల దాడిని ఖండిస్తున్నాని, చంద్రబాబు రాక్షస పాలనకు ఈ సంఘటనే నిదర్శమ‌ని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది అని విమర్శించారు.కాగా క‌న్నాపై లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న గొర్రెపాటి.ఉమమాహేశ్వ‌రావు అనే వ్య‌క్తి చెప్పు విశారాడు.బిజెపి కార్య‌క‌ర్త‌లు అత‌న్ని ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు.
సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 5 ప్రశ్నలతో ఓ బహిరంగ లేఖను చంద్రబాబుకు రాశారు.ఈ లేఖ ద్వారా ప్రశ్నలు వేస్తున్నానని వాటికి ఆయన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ప్రతివారం చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు వేస్తానని..వాటికి సమాధానాలు చెప్పాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
1- టీడీపీ వెబ్ సైట్ నుంచి 2014 ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు?
2- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు చేసిన తొలి వాగ్దానాలు అమలు చేశామని చెప్పగలరా?
3- జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయాన్ని అంగీకరిస్తారా?
4- విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల ద్వారా ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయో చెప్పగలరా?
5- ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అనే మాటలు మీవి కావని చెప్పగలరా?

LEAVE A REPLY