ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు-క‌న్నా

0
106

క‌డ‌పః ముఖ్య‌మంత్రి చంద్రబాబుకి ఓట్ల భయం పట్టుకుందని,ఎన్నికల్లో ఓడిపోతే ఆయన చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని బీజేపీ నేతలపై నిందలు వేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నాజ.లక్ష్మీనారాయణ విమర్శించారు. క‌డ‌ప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శ‌నివారం తిరుపతి-రాజంపేట మీదుగా కడపకు చేరుకున్నారు.ఈ సంద‌ర్బంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తనకు రాయలసీమ ప్రజలు ఓట్లు వేయలేదనే కోపంతోనే ఇక్కడి అభివృద్ధిని చంద్రబాబు నిర్ల‌క్ష్యం చేస్తున్న‌ర‌ని ఆరోపించారు. డెబ్బై శాతం పూర్తయిన గాలేరు – నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను ఇంకా పూర్తిచేయకుండా,కొద్ది కొద్దిగా ప‌నులు చేస్తు వాటి అంచనా వ్యయాలను ప్రతి ఏటా పెంచుకుంటూ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.కన్నా పర్యటనను సీపీఐ నేతలు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారం మేర వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY