అన్నంపెట్టే చేతులను నరకడం చంద్రబాబుకు అలవాటే-క‌న్నా

0
87

అమరావతిః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేయలేదని,కుట్ర రాజకీయాలతో చంద్రబాబే రాష్ట్ర ప్రజలను మోసం చేశారని,ఇప్పటికే అవినీతి, అక్రమ పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మరోసారి అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా.లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.సోమ‌వార‌ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్‌లో భారతీయ జనతా పార్టీ, నేతలు ధర్నాకు దిగారు.ఈసంద‌ర్బంగా అయ‌న మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన దేవెగౌడ,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు చేతులు కలిపారని మండిపడ్డారు.చంద్రబాబే పెద్ద మోసగాడని,2014 నుంచి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి సాయం చేస్తున్న ప్రధాని మోడీని మోసగాడని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.అన్నంపెట్టే చేతులను నరకడం చంద్రబాబుకు అలవాటేనని కన్నా వ్యాఖ్యానించారు.ఇప్పుడు బీజేపీ,మోడీపై కుట్ర పన్నుతున్నారని, బలమైన ప్రచార సాధానాలతో ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు మాట్లాడించి నిజం చేద్దామని చూస్తున్నారని విరుచుకుప‌డ్డారు.ప్రజల సమస్యను పక్కదారి పట్టించి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని,చంద్రబాబు ఏపీకి ఏం చేశారో చెప్పగలరా? అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. పోలవరంపై ఖర్చు పెట్టే ప్రతీపైసా కేంద్ర ప్రభుత్వానిదేనని,కేంద్రం నిధులతో చంద్రన్నబీమా అమలు చేస్తున్నారని తెలిపారు.ఇసుక మాఫియా,మట్టి మాఫియా,అవినీతిని బాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.రైతులను మోసం చేస్తూ,ధాన్యం నింపే బస్తాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.టీడీపీ నేతలు పందికొక్కుల కంటే హీనంగా దోచుకుంటున్నారని కన్నా ధ్వజమెత్తారు.ఎన్నికలు ఏడాది ఉందనగా, ఇప్పుడు పథకాలు ప్రకటిస్తున్నారని,ఏవ‌రిని వంచించేందుకు ఈప‌థ‌కాల‌న్నారు. గృహ నిర్మాణాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, కేంద్రం డబ్బులిస్తే చంద్రబాబు,టీడీపీ.. కేంద్రంపైనే దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.మోడీ గ్రామీణాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే.. చంద్రబాబు సర్కారు పక్కదారులు పట్టిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నేత పురంధేశ్వరి, మాజీ మంత్రి మాణిక్యాలరావు, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ నాయుడులు పాల్గొన్నారు.

LEAVE A REPLY