ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు త్వరలో రాష్ట్రంలో పరుగులు-జీవీఎల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణలు అయిన విజయవాడ,విశాఖపట్టణం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నదని,ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ప్రకటన చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ పేర్కొంటు గురువారం ఓ ట్వీట్ చేశారు.‘ఏపీ ప్రజలకు శుభవార్త’ అని, విశాఖపట్నం- విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని తాను రెండు నెలల క్రితం రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ని అభ్యర్థించానని, త్వరలోనే రైలును ప్రవేశపెడతానని తనకు లేఖ ద్వారా గోయల్ ధృవీకరించారని పేర్కొన్నారు.