నాలుగు తరాల పాటు దేశానికి మీరేం చేశారు ?

0
46

అమ‌రావ‌తిః ఎన్డీఏ ప్ర‌భుత్వం గ‌త 4 సంవ‌త్స‌రాల నుండి అవినితి ర‌హిత‌పాల‌న అందించింద‌ని,వార‌స‌త్వ రాజ‌కీయాతో అధికారంలోకి రావ‌ల‌నుకునే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ,, ప్రభుత్వంపై ఆస‌త్య ఆరోణ‌లు చేయ‌డంపై బీజేపీ జతీయాధ్యక్షుడు అమిత్‌ షా మండిపడ్డారు. అదివారం ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో ఏం చేశారని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారని, మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాము,, రాహుల్‌కి కాదు. మేము అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు.ఈ నాలుగేళ్లలో ఏం చేశారని రాహుల్‌ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.. మ‌రి నాలుగు తరాల పాటు మీరేం చేశారని ఆయనను ప్రజలు అడుగుతున్నారని,, దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అంటు ప్ర‌శ్నించారు.మోదీ సర్కారు పాల‌న‌లో మన దేశ సరిహద్దు వ‌ద్ద సైనికులు రెట్టించి ఉత్స‌హంతో ప‌హారాకాస్తుండ‌గా, పాకిస్థాన్‌ రాత్రి, పగలు దాడులకు పాల్పడుతోందన్నారు.మోదీ సర్కారు పాలనలో మన సైనిక దళాలు సర్జికల్‌ స్ట్రయిక్స్ జరిపాయని, ‘భారత్‌ మాతా కి జై’ నినాదాలు చేస్తూ తిరిగి వచ్చాయన్నారు.అలాగే, ఎన్డీఏ సర్కారు భారత్‌ను ప్రపంచంలో ఓ గౌరవనీయమైన స్థానంలో ఉంచిందని,ఈ విష‌యాలు మీకు గుర్తు వుండ‌క‌పోవ‌చ్చునేమో,,దేశ‌ప్ర‌జ‌ల‌కు గుర్తున్నాయ‌న్నారు

LEAVE A REPLY