కుక్కుపిల్ల‌ను కాపాడే క్ర‌మంలో భార్గ‌వ్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయడా ?

0
97

నెల్లూరుః భార్గవ్ ఆర్ట్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి బాల‌కృష్ణ‌తో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత S.గోపాల్‌రెడ్డి తనయుడు బార్గవ్‌రెడ్డి,మంగ‌ళ‌వారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించగా,ఆయన మరణానికి కారణం ఓ కుక్కపిల్లని తెలుస్తోంది? అందుబాటులోని మరింత సమాచారం ప్రకారం, చెన్నైలో నివాసం ఉంటున్న భార్గవ్ కు నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలో రొయ్యల హ్యాచరీ ఉంది.సోమవారం రాత్రి హేచ‌రీ వ‌ద్ద‌కు వచ్చిన భార్గవ్,రాత్రి 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లి, ఉదయం మృతదేహమై కనిపించారు. ఓ కుక్కపిల్ల సముద్రపు కెరటాల ధాటికి కొట్టుకుపోతుండగా చూసిన భార్గవ్,కుక్కపిల్లను కాపాడేందుకు వెళ్లి కెరటాల వేగానికి సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు స్దానికులు భావిస్తున్నారు ? వాకాడులోని పంబ‌లి వ‌ద్ద మృతు దేహం కోట్టుకుని వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుంది,అది పూర్తయితే కాని భార్గవ్‌రెడ్డి మరణానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అన్న విషయం వెల్లడవుతుందని పోలీసు వర్గాలు వ్యాఖ్యనిస్తున్నాయి.విషాదమైన విష‌యం ఏమిటంటే 10 సంవ‌త్స‌రాల క్రింద‌ట భార్గ‌వ్‌రెడ్డితల్లి మ‌ర‌ణించ‌గా అమె మృతుదేహంను పంబ‌లి వ‌ద్ద ఉన్న హేచ‌రి ద‌గ్గ‌రే ఖ‌న‌నం చేశారని తెలుస్తుంది.

LEAVE A REPLY