బయ్యారం,కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కావు-కేంద్రం

0
177

అమ‌రావ‌తిః బయ్యారం ఉక్కు కర్మాగారం, కడప ఉక్కు కర్మాగారం సాధ్యం కావని కేంద్రం బుధవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఏముందో న్యాయస్థానానికి తెలిపింది. కర్మాగారాల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని,తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని తేల్చి చెప్పినా,మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చాయని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నతర్వాత ఇప్పుడు స్పష్టంగా నివేదిక వచ్చినట్టు పేర్కొంది.తమ ప్రభుత్వం ఏర్పాటయిన ఆరు నెలల్లోనే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదని,ఇప్పటికే ఉన్నపరిశ్రమలు నష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పామని తెలిపారు.అలాగే ఖనిజాలు దొరకడం కూడా కష్టతరం అవుతోందని,ఇలాంటి సమయంలో ఇప్పటికిప్పుడు కొత్తగా ఏపీ,తెలంగాణలలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని తాము స్పష్టం చేశామని పేర్కొంది.అనేక మంత్రిత్వ శాఖలు,కేంద్రంలోని పలువురు మంత్రులు మరోసారి పరిశీలించాలని చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో మెకాన్‌ సంస్థతో పూర్తిస్థాయిలో అధ్యయనం చేశామని తెలిపింది.ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తే బయ్యారం,కడపలోలలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యంకాదని తేల్చి చెప్పింది.

LEAVE A REPLY