గ‌తంలో వ‌లే న‌వ్య‌,వ‌నితా కార్డుదారుల‌కు రాయితీ వ‌ర్తింపు-ర‌వివ‌ర్మ‌

0
67

నెల్లూరుః APSRTC ఇటీవ‌ల కాలంలో న‌వ్య,వ‌నితా కార్డుదారుల‌కు పల్లెవెలుగు,ఎక్ర్‌ప్రెస్ బ‌స్సుల్లో చిల్లర స‌మ‌స్య‌ను అధిక‌మించే కార్య‌క్ర‌మంలో చార్జీలు స‌రిచేసేందుకు కొన్ని చ‌ర్య‌లు తీసుకొవ‌డం జ‌రిగింద‌ని సింహ‌పురి రీజియ‌న్ మేనేజ‌ర్ ర‌వివర్మ శుక్ర‌వారం తెలిపారు.కొన్ని స్టేజీల్లో న‌వ్య‌,వ‌నితా కార్డుదారుల‌కు రాయితీ స‌రిగా వ‌ర్తించ‌డం లేద‌ని ఫిర్యాదులు అందాయ‌న్నారు.ప్ర‌స్తుతం న‌వ్య‌,వ‌నితా కార్డుదారుల‌కు అంద‌రికి కిలో మీట‌ర్ల‌తో సంబంధం లేకుండా గ‌తంలో లాగానే చార్జీల్లో రాయితీ ల‌భిస్తుంద‌న్నారు.ఇది APSRTC వారు 03-07-2018 తేది వ‌ర‌కు మంజూరుచేసిన న‌వ్య‌,వ‌నితా కార్డుదారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని,ప్ర‌స్తుతం సాప్ట్‌వేర్ డెవ‌ల‌ప్ చేసి త్వ‌ర‌లో పై కార్డుదారుల‌కు చార్జీల‌తో రాయితీ వ‌ర్తిస్తుంద‌ని,కార్డుదారులు టిక్కెటుకు స‌రిప‌డా చిల్ల‌ర తెచ్చుకొని APSRTC సిబ్బందితో స‌హ‌కరించాల‌ని విజ్ఞాప్తి చేశారు.

LEAVE A REPLY