అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ!

అమ‌రావ‌తిః రాష్ట్రంలోని రైతుల‌ను అన్ని విధాల అదుకుంటుమ‌న్న చంద్ర‌బాబు,,కేంద్రం ప్ర‌క‌టించిన దాని కంటే ఒక‌టిన్న‌ర రెట్లు,, రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రకటించిన*అన్నదాత సుఖీభవ*పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ పథకం ద్వారా పెంచిన మొత్తాన్నిఈ జీవోలో పొందుప‌ర్చింది.అందుబాటులో ఉన్నమంత్రుల సంతకాలను తీసుకుని ఈ జీవోను విడుదల చేసింది.ఈ పథకం కింద తొలి విడతగా ఇస్తామన్ననాలుగు వేల రూపాయల్లో మొదట దఫాగా కొంత నగదును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొంత నగదును జమ చేయనుంది.రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చేరూ. 9 వేలు కలిపి మొత్తం రూ.15 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 54 లక్షల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రయోజనం పొందనున్నారు.