క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఏదైనా సాదించ‌వ‌చ్చు

0
130

నెల్లూరుః క్ర‌మ‌శిక్ష‌ణ ద్వారా విజ‌యం సాధించుకోవాల‌ని అదేవిధంగా యువ‌త పోటీత‌త్వంతో త‌మ శ‌క్తి సామ‌ర్ద్యాల‌ను ఒడ్డి ముందుకు వెళ్లాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్‌-2 వెంక‌ట సుబ్బారెడ్డి అన్నారు.సోమ‌వారం స్దానికి టౌన్‌హాల్‌లో యువ‌జ‌న స‌ర్వీసుల‌శాఖ-సెట్న‌ల్ సంయుక్తంగా నిర్వ‌హించిన జిల్లా స్దాయి యువ‌జ‌నోత్స‌వాల్లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ డిజిజన్ స్దాయి నుండి జిల్లా స్దాయి ఎంపికైన యువ‌త అంకిత భావంతో కృషి చేసి రాష్ట్ర స్దాయి,జాతీయ‌స్దాయిలో జ‌రిగే యువ‌జ‌నోత్స‌వాల్లో పాల్గొల‌న్నారు.సెట్న‌ల్ సి.ఇ.ఓ డాక్ట‌రు సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ యువ‌త‌కు మార్గ‌ద‌ర్శి స్వామి వివేక‌నందుడ‌ని,జ‌న‌వ‌రి 12,2018న వివేక‌నంద జ‌యంతిని పురస్క‌రించుకొని 5 రోజుల‌పాటు జాతీయ‌స్దాయిలో యువ‌జ‌నోత్స‌వాలు నిర్వ‌హించ‌బ‌డ‌తాయని,రాష్ట్ర స్దాయిలో 18 ఆంశాల‌ల్లో పోటీలు వుంటాయ‌న్నారు.అందులో కూచిపుడి,బ‌ర‌త‌నాట్యం,క‌థ‌క్‌,ఓడిస్సిలు, హిందుస్దాని,క‌ర్నాట‌క సంగీతాలు,వాయిద్యాలు,వ‌కృత్త్వ పోటీలు,నాటికలు వుంటాయని తెలిపారు.ఈకార్య‌క్ర‌మంలో నూడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY