అమృత జ‌య‌ల‌లిత కుమార్తెనా..?

0
146

అమ‌రావ‌తిః సినిమా హీరోయిన్స్ జీవితాలు కొన్ని క‌థ‌లు తెర వెనుక మిగిలిపోతాయి అనేందుకు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత జీవితమే నిద‌ర్శ‌నం. జ‌య‌ల‌లిత‌ అవివాహిత అయినప్పటికీ ఆమెకు శోభన్‌బాబు ద్వారా కలిగిన కూతురు ఉందనే విషయం అప్పుడప్పుడు మీడియాలో విన్పిస్తు వ‌స్తుంది. తాజాగా తాను జయలలిత కూతుర్ని అని బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా ప్రారంభంమైంది. ఈ కేసును కర్ణాటక హైకోర్టులోలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చడంతో ఈ అంశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నది.సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అమృత తెలిపిప వివ‌రాల‌ ప్రకారం నేను 1980 ఆగస్టు 14న జయలలిత కడుపున జన్మించాను. పెంపుడు తల్లి శైలజ సంరక్షణలో పెరిగాను. 2015లో నా పెంపుడు తల్లి మరణించింది. ఈ ఏడాది మార్చి 20న నా పెంపుడు తండ్రి కూడా మరణించాడు. జయలలిత జీవించి ఉన్నప్పడు నేను తన కుమార్తెను అని ప్రకటిస్తే ఆమె ప్రతిష్ట దెబ్బతింటుంది అని దాచిపెట్టాను అని అమృత పేర్కొన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు కర్ణాటక హైకోర్టులో దాఖలు కానున్నది. ఆదేశాల ప్రకారం కేసును దాఖలు చేయడానికి అమృత సిద్ధమవుతున్నట్టు సమాచారం. జయలలితకు బిడ్డ ఉన్న మాట వాస్తవమేనని ఆమె మేనత్త కూతురు లలిత కూడా ఇటీవల వెల్లడించడం అమృత వ్యవహారానికి బలం చేకూరింది.హైకోర్టులో విచార‌ణ‌నంత‌రం నిజ నిజాలు వెలుగు చూడ‌నున్నాయి.?

LEAVE A REPLY