జియో కంటే త‌క్కువ‌కు ధ‌ర‌కు ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్‌

0
283

1399 కే 4జీ కార్బన్ ఏ40..
అమ‌రావ‌తిః జియోఫోన్ ఇచ్చిన ఆఫ‌ర్‌ల‌ను తట్టుకుని,మార్కెట్‌లో నిల‌దొక్కుకోవాలంటే,జియో కంటే త‌క్కువ‌కు ఫోన్‌తో పాటు ప్యాకెజ్‌లు ఇస్తేనే వినియోగ‌దారుడు త‌మ నెట్ వ‌ర్క్‌తో వుంటాడ‌ని,లేదంటే ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు మారిపోతాడ‌న్న స‌త్యం గ‌మ‌నించిన‌,ఇత‌ర సెల్‌ఫోన్ కంపెనీలు జియో కంటే త‌క్కువ ధ‌ర‌కే ఆప్‌ర్స్ ప్ర‌క‌టిస్తున్నాయి.ఈనేప‌థ్య్యంలో జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ అతి తక్కువ ధరకే తన 4జీ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. కేవలం రూ. 1399కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నట్లు తెలిపింది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్ ఆధారితంగా వస్తున్న ఈ ఫోన్ లో ఫుల్ టచ్ స్క్రీన్, డ్యూయల్ సిమ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరును ‘కార్బన్ ఏ40’గా నిర్ణయించామని చెప్పింది.
ఈ ఫోన్ కావాలనుకునేవారు ముందుగా రూ. 2899 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్ తో పాటు 36 నెలల పాటు ప్రతి నెలా 169 రూపాయల రీచార్జ్ అవుతుంటుంది. 18 నెలల తర్వాత రూ. 500 రీఫండ్ చేస్తారు. 36 నెలల తర్వాత మరో రూ. 1000 రీఫండ్ చేస్తారు. అంటే, రూ. 1500 క్యాష్ బెనెఫిట్ ఉంటుందన్నమాట.

LEAVE A REPLY