అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు మేము సిద్దం-GSL GROUP

0
77

అమ‌రావ‌తిః అగ్రిగోల్డ్ ఆస్తులు కొన‌లేమని చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న‌GSL GROUP మ‌ళ్లీ ఆగ్రిగోల్డ్ ఆస్తుల‌ను కొనుగొలు చేసేందుకు ముందుకు వచ్చింది.అగ్రిగోల్డ్ 10 ఆస్తుల విలువను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్ సంస్థను హైకోర్టు ఆదేశించి, కేసును ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు GSL GROUP అంతకుముందు ఆసక్తి చూపించి ఆ తర్వాత వెనక్కి తగ్గింది.తాము అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకోలేమని,గతంలో దాఖలు వేసిన పిటిషన్‌ను GSL GROUP ఉపసంహరించుకుంది.‌ఇందుకు గల కారణాన్ని కూడా వివరిస్తు అగ్రిగోల్డ్ ఆస్తుల కంటే అప్పులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని విచారణలో భాగంగా సోమవారం హైకోర్టుకు GSL GROUP వెల్లడించింది.అయితే ఇప్పుడు మళ్లీ కొనుగొలుకు ముందుకు రావ‌డం గ‌మ‌ర్హం ? లోగుట్టు పెరుమాళ్ళ‌కు ఏరుక ??

LEAVE A REPLY