రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

0
122

పశ్చిమగోదావరిః ఆదివారం ఉదయం జ‌రిగిన ఘోర‌ రోడ్డుప్రమాదంలో ఓ బాలుడు,మ‌రో వ్య‌క్తి అక్క‌డిక్క‌డే మృతి చెందారు సంఘ‌ట‌న వివరాలు ఇలా వున్నాయి.పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద 16వ జాతీయ రహదారిపై అతి వేగంతో వెళుతున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి ఆటోను, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడేళ్ల బాలుడితో పాటు ఓ వ్యక్తి మృతి చెందగా 18 మంది మహిళా కూలీలు గాయపడ్డారు.మ‌రిణించిన వారు కురెళ్లగూడెం గ్రామానికి చెందిన పాలూరి అరుణ్‌(7), దాసరి కృష్ణ(55)గా గుర్తించారు.మ‌రోనలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే వీరాంజనేయులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY