ఒంటిమిట్ల చెరువులో 7 గురు ఎర్ర‌చంద‌నం కూలీలు మృతి ?

0
153

క‌డ‌పః రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో 7 గురు మృతిచెంది వుండ‌డం క‌ల‌క‌ల సృష్టించింది.ఆదివారం స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌న స్ద‌లంకు చేరుకుని పరిశీలించారు. మృతులు ఎర్రచందనం కూలీలు అయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రెండు రోజుల క్రింద‌ట ఎర్రచంద‌నం స్మ‌గ‌ర్ల కోసం పోలీసులు వాహ‌నాల త‌నిఖీ నిర్వ‌హించిన సంద‌ర్బంలో,పోలీసుల నుండి త‌ప్పించుకునేందుకు వీరు చెరువులో దూకి వుంటార‌న్న అనుమానులు వ్య‌క్తం అవుతున్నాయి.మృతుల వ‌ద్ద దొరికి బ్యాగుల్లో వ‌స్తువుల ద్వారా వీరి వివ‌రాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

LEAVE A REPLY