9 మంది క్రికెట్ బుకీలు అరెస్ట్‌-ల‌క్షల్లో న‌గ‌దు,సెల్‌ఫోన్‌,ల్యాప్‌టాప్‌లు స్వాథీనం

0
350

అనంతపురంః పుట్ట గొడుగుల్ల క్రికెట్ బుకీలు పుట్టుకుని వ‌స్తునే వుంటారు,ఎందుకంటే ఎలాంటి పెట్టుబ‌డి లేని వ్యాపాం,పందెలు కాసేవారు,వున్న‌దంట తుడిచిపెట్టుకుని పోయిన ఎవ‌రికి చెప్పుకొలేని ప‌రిస్దితి.ఒక వేళ పోలీసు ప‌ట్టుకున్న అదేమంత పెద్ద కేసు కాదు,రెండు,లేదా మూడు వార‌ల్లో బెయిల్‌పై బ‌య‌ట‌కు వచ్చేస్తారు.దింతో నిల‌బడిన ప్ర‌తి ఒక్క‌రు పంట‌ర్లు,బుకీలుగా మారి పోతున్నారు.ఈనేప‌థ్యంలో అనంత‌పురం జిల్లా తాడిపత్రిలో9మంది బుకీలను పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు.క్రికెట్ పందెలు జోరుగా సాగుత‌న్న‌ట్లు స‌మాచారం అంద‌డంతో,, పట్టణంలోని సీఐలు, ఎస్సైలు పకడ్బంధీగా నిఘా వుంచి ఎస్‌బీఎం ఫంక్షన్‌ హాలు వద్ద క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్టు గుర్తించారు.పోలీసులు దాడులు నిర్వ‌హించ‌డంతో అక్కడకు వ‌చ్చిన‌ సయ్యద్‌ జావేద్‌ ఖాద్రి అనే వ్యక్తితో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి నుంచి రూ.24లక్షల నగదు, 12 సెల్‌ఫోన్లు, 2 లాప్‌టాప్‌లు, ఒక ఎల్‌సీడీ టీవీ, ప్రింటర్‌, కమ్యూనికేటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY