యాజ‌మాన్యం నిర్ల‌ల‌క్ష్యాణ‌నికి 7 మంది కార్మికులు బ‌లి

0
85

చిత్తూరుః యాజ‌మాన్యం నిర్ల‌ల‌క్ష్యానికి మ‌రో 7 మంది కార్మికులు బ‌లైయ్యారు.శుక్ర‌వారం చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు మొరం గ్రామంలో వేంక‌టేశ్వ‌ర హేచ‌రీస్‌లోని డ్రైనేజ్‌ను పైప్‌ను శుభ్రంచేస్తున్న కార్మికులు,విష‌య‌వాయువుల వల్ల ప్రాణ‌లు విడిచారు.కార్మికులు ఇలాంటి ప‌నులు చేస్తున్న‌పుడు తీసుకొవాల్సిన క‌నీస జాగ్ర‌త్తలు పాటించ‌క‌పోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.హేచరీస్‌ యాజమాన్యం ఆదేశాలతో కార్మికులు వ్యర్థాలను శుభ్రం చేసేందుకు డ్రైనేజీలోకి దిగారు. అందులోకి వచ్చే వ్యర్థాల్లో రసాయనాల కలవడంతో మొదట దిగిన నలుగురు కార్మికులు అందులోనే స్పృహ కోల్పోయారు. వాళ్లను పైకి తీసేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కార్మికులు కూడా అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మురుగు కాలువ పైకప్పును ప‌గుల‌కొట్టి కార్మికుల‌ను బ‌య‌ట‌కు తీశారు.వీరిని చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మార్గమధ్యలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

LEAVE A REPLY