ఫైబర్ నెట్ కేబుల్‌కు 6 చోట్ల క‌త్తెరా.?

0
92

అమరావతిః ఒక ప్ర‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబర్ నెట్‌ను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రారంభిస్తున్న స‌మయంలోనే, రాష్ట్రపతి పర్యటనా కార్యక్రమం ప్రసారం కాకుండా తూర్పు గోదావరి జిల్లాలో ఇంటర్ నెట్ ఫైబర్ కేబుల్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కట్ చేశారు. సంఘటన వివ‌రాలు తెలియ‌డంతో, మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫోన్ చేసి సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇందుకు కారకులైన వారికి శిక్షపడేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను తక్కువ ధరకే అందిచేందుకు ప్రభుత్వం పాటుపడుతుంటే, ఇలాంటి ఘటనలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. ఆరు చోట్ల కేబుల్‌ను కట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. దుండ‌గులు కేబుల్ కట్ చేసినప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాష్ట్రపతి పర్యటన ప్రసారమయ్యేలా చూశారు.

LEAVE A REPLY