4999కే Shine M815 4G మొబైల్‌

0
86

అమ‌రావ‌తిః దేశీయ మెబైల్ కంపెనీ అయిన మాఫే,అన్ని ఫీచ‌ర్లు ఉన్న‌ మొబైల్‌ను అత్యంత తక్కువ ధరలో 4జీ విభాగంలో లాంచ్ చేసింది. షైన్ ఎం815 పేరుతో వచ్చిన ఈ 4జి మొబైల్ ధరను కంపెనీ రూ 4,999గా నిర్ణయించింది. డ్యూయల్ సిమ్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 15గంటల టాక్‌ టైంను ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..మాఫే ‘షైన్ ఎం815’ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు 5 అంగుళాల డిస్‌ప్లే 480 x 854 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్‌ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 1 జీబి ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ 64 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 5ఎంపీ వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌ 2ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి.దేశవ్యాప్తంగా స‌ర్వీసు అందించేందుకు 650 సెంట‌ర్స్ వున్న‌యని,క‌స్ట‌మ‌ర్‌కు ఇబ్బంది లేకుండా,తాత్క‌లికంగా మ‌రో స్టాండ్‌బై మొబైల్ రిపేర్స్ అయ్యే వ‌ర‌కు అందించ‌డం జ‌రుగుతుంద‌ని తెలియ‌చేశారు.

LEAVE A REPLY