3వ డివిజనులో మౌలిక వసతులు కల్పిస్తాం- నగర మేయరు

0
202

నెల్లూరుః నగరంలోని 3 వ డివిజను ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పిస్తామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంకోసం కొండయ్యతోపు ప్రాంత వాసులు మేయరును హరనాధపురంలోని ఆయన నివాసంలో ఆదివారం కలుసుకుని వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై స్పందించిన మేయరు డివిజను పరిధిలో రోడ్డ్లు, మంచి నీరు, వీధి లైట్లు తదితర వసతులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పోరేషనుఎన్‌.ఇని ఆదేశించారు.అనంతరం మేయరు మాట్లాడుతూ అర్హులైన వారు హౌసింగ్ ఫర్ అల్ పధకంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం మంజూరు చేసే గృహాలు లబ్దిదారులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

LEAVE A REPLY