15 మునిసిపాలిటిల‌కు క‌మీష‌న‌ర్ల నియామ‌కం

0
247

అమ‌రావ‌తిః రాష్ట్ర ప్ర‌భుత్వం కార్పొరేష‌న్ ప‌రిధిలో చేప‌ట్టాల్సిన అభివృద్ది ప‌నుల వేగం పెంచేందుకు భారీ ఎత్తున పంచాయితీ,మునిసిపాలిటిల్లో బదిలీల కార్య‌క్ర‌మం చేపట్టింది.రాష్ట్రంలోని ప‌లు మున్సిపాల్టీలకు కమిషనర్లను నియమిస్తూ జీ. ఓ నెం 772 ద్వారా బుధవారం ఉత్త‌ర్వులు జారీచేసింది. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా కె.శివపార్వతి,అనంతపురం ప్రాంతీయ డైరెక్టర్‌గా ఎస్‌.రవీంద్రబాబు,గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్‌గా సీహెచ్‌.నాగమల్లేశ్వరరావు, జగ్గయ్యపేట మున్సిపల్‌ కమిషనర్‌గా పి.రమేశ్‌, రాజాం మున్సిపల్‌ కమిషనర్‌గా ఎస్‌.వెంకటరమణ, నందిగామ పంచాయతీ కమిషనర్‌గా ఎ.అంజయ్య, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీనివాస్‌,నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌గా ఆర్‌.లోకేంద్రన్‌, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఎం.జీవరత్నం, శ్రీకాకుళం కార్పొరేషన్‌ రెవెన్యూ అధికారిగా నూకేశ్వరరావు, కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా కె.ప్రమీల,తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కమిషనర్‌గా ఎ.శామ్యూల్‌, సామర్లకోట మున్సిపల్‌ కమిషనర్‌గా సీహెచ్‌ వెంకటేశ్వరరావు,జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కమిషనర్‌గా నగీనా సుల్తానా బేగం, చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్‌గా బి.శ్రీనివాసులును నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

LEAVE A REPLY