నేడు శిల్పిసర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ‌ జయంతి

0
178

అమ‌రావ‌తిః వాస్తవాలను వదలక.గాలిలో సౌధాలను కట్టక.అట్టడుగు నుండి నవభారతానికి సుస్థిరమై పునాది నిర్మించిన అమర శిల్పిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబరు 31 జాతీయ ఐక్యతా దినోత్సవం. మనం అన్ని పాఠశాలలో జరుపుకోవలసిన పండుగ.
భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు.బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లభాయ్ పటేల్ దేశంలో జర్గుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.
1950 డిసెంబరు 15 న వల్లభాయ్ పటేల్ కన్నుమూశాడు. ముంబాయి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో    అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.1991లో భారత ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించింది.

LEAVE A REPLY