హోదా ఉండుంటే ఈ పాటికే ఉద్యోగాలొచ్చేవి-యువభేరి సభలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

0
157

వేలాదిగా పోటెత్తిన యువత, విధ్యార్థులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు..
అనంత‌పురుః పార్లమెంట్‌ సాక్షిగా హామీయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయిది. కానీ.. అధికారంలో ఉన్నవారు మోసం చేయడంతో ఆ పరిస్థితిని మనం చూడలేకపోతున్నాం. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదామ‌ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.సోమవారం అనంతపురం పట్టణంలోని ఎంవైఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జగన్‌ పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు అనంతపురంలో జరుగుతున్నది 10వ యువభేరి అని గుంటూరులో 9వ యువభేరి తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, తర్వాతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరిగడంతో.కొంత విరామం తర్వాత తిరిగి పోరాటాన్ని పునఃప్రారంభించడం జ‌రిగింద‌న్నారు.
గత మూడున్నర సంవత్సరాలుగా అందరం కలిసికట్టుగా పోరాడం. ప్రత్యేక హోదా కోసం ఇక్కడికొస్తే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించారు. ప్రత్యేక హోదా మూడున్నరేళ్లలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా రెండు నిరాహార దీక్షలు జరిగాయి. మంగళగిరిలో రెండు రోజులు, గుంటూరులో 7 రోజులు దీక్ష చేశాం. చంద్రబాబు పోలీసుల్ని పంపి గుంటూరు దీక్షను భగ్నం చేశారు. కనీసం ఆయనైనా మోదీని ప్రత్యేక హోదా గురించి అడిగారా అంటే అదీ లేదన్నారు. అనంతపురం లాంటి జిల్లాకు ప్రత్యేక హోదా చాలా అవసరం. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ తర్వాత దేశంలో అతితక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురమే కావచ్చ‌ని,చివ‌రికి రైతుల ఆత్మహత్యలు సైతం ఎక్కువగా ఉన్న జిల్లా కూడా అనంతపురమే కావడం శోచనీయం.
నంబర్‌ 2 నుంచి పాదయాత్ర : నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుంది. 6 నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర జరుగుతంది. యువభేరి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గ కోఆర్డినేటర్లు.. కాలేజీలకు వెళ్లి, విద్యార్థులను కలుస్తారు. ప్రజల మద్దతును కూడగడుతూ, అవసరమైనప్పుడు చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం. పోరుబాటలో భాగంగా రాబోయేరోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. పిల్లలకు పరీక్షలనే ఉద్దేశంతో హోదా ఉద్యమానికి విరామం​ ఇచ్చాం. ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? జగన్‌ మాట్లాడితేనే ప్రత్యేకహోదా అనే పరిస్థితి మారాలి. పాలకులపై ఒత్తిడి పెరగాలి. ఆమేరకు మనం పోరాటాలు చేయాలి. అందుకోసం మీ అందరి తోడ్పాటు, సహకారం కావాలి. అప్పుడే మనం హోదాను సాధించుకుంటాం. ప్రత్యేక హోదా అంటే ఉద్యోగాల కోసం మన పిల్లలు ఎక్కడికో పోవాల్సిన పనిలేదు. చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అని గుర్తుంచుకోండి’’ అని జగన్‌ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

LEAVE A REPLY