హిందుపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఏసి క్యాజువాలిటీ-మంత్రి కామినేని

0
506

అనంతపురంః హిందూపురంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రూ.20.15 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ “బసవతారకం మాతా శిశు వైద్యశాలను శుక్ర‌వారం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్,ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ. ప్రారంభించారు.ఈసంద‌ర్భంలో మంత్రి మాట్లాడుతూ హిందూపురం మాతా శిశు ఆసుపత్రిలో ఒకేసారి 8 మంది ప్రసవించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు 30మందికి ఉచిత డయాలసీస్ సేవలు అందుతున్నాయ‌ని, రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ క్యాజువాలిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.అనంత‌రం హిందూపురంలో అంగన్ వాడీ సెంటర్ ను మంత్రులు కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, ఎమ్మెల్యే బాలక్రిష్ణ.ప్రారంభించారు.

LEAVE A REPLY