స‌ర్పంచ్ అవినితితో గ్రామంకు మౌలిక స‌దుపాయ‌లు క‌రువు-ఉచ్చురు గ్రామ‌స్దులు

0
116

నెల్లూరుః దొర‌వారి సత్రం మండ‌లం ముచ్చురు గ్రామంకు చెందిన దాదాపు 100 కుటుంబాల‌కు చెందిన వారు సోమ‌వారం గ్రీవెన్స్ డే సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంకు వ‌చ్చి విన‌తి ప‌త్రం అంద‌చేశారు.అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంకు క‌నీస సౌక‌ర్యాలు అయిన రోడ్లు,మంచినీటి వ‌స‌తి లేవ‌న్నారు.ఈ విష‌యంపై ఎన్నో సార్లు నాయ‌కుల‌కు,అధికారుల‌కు మొర పెట్టుకున్న ఫ‌లితం లేద‌న్నారు.అలాగే గ్రామంలో దాదాపు 200 మంది 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారు ఉన్న‌ర‌ని,వారికి ఏవ‌రికి ఫించ‌న్లు అంద‌డం లేద‌న్నారు.ఇప్ప‌టికైన అధికారులు స్పందించాల‌ని కోరారు.

LEAVE A REPLY