స్వచ్ఛ నగరంకోసం పాటుపడుదాం- ‘స్వచ్ఛతే సేవ’ ప్రతిజ్ఞా కార్యక్రమంలో జాయింట్ కలెక్ట‌ర్‌,మేయ‌ర్‌

0
163

నెల్లూరుః మహాత్మాగాంధీ ఆశయ సాధనకోసం దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛనెల్లూరు నగరంకోసం పాటుపడుదామని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌.మేయరు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు.శుక్ర‌వారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గాంధీవిగ్రహం కూడలిలో స్వచ్ఛతే సేవ ప్రతిజ్ఞా కార్యక్రమానికి మేయరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ రాజకీయ స్వాతంత్యం మాత్రమే కాకుండా స్వచ్చమైన భారతదేశాన్ని ఆకాంక్షించారని తెలిపారు. స్వచ్ఛ ఆంద్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్చ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ పూనాలని కోరారు. విద్యార్ధులు, యువత, మహిళలు స్వచ్చందంగా సెప్టెంబరు 15 నుంచి గాంధీ జయంతి వరకు స్థానిక పరిసరాలను శుభ్రం చెయ్యడంలో కార్పోరేషను సిబ్బందితో మమేకం అవుతారని వివరించారు. నగరంలోని ప్రధాన మార్గాలు, పార్కులు, పాటశాలలు, రవాణా సంస్థలు, విగ్రహాలను శుభ్రం చేసేందుకు రోజూవారి ప్రణాళికలను సిద్దం చేసామని మేయరు పేర్కొన్నారు. గతంతో పోల్చితే పరిసరాల శుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేసారు. స్వచ్చమైన భారత దేశాన్నిభ‌విష్య‌త్‌ తరాలవారికి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతా అన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రతను పాటిస్తామంటూ స్వచ్ఛతే సేవ ప్రతిజ్ఞను జేసి 2 వెంకటసుబ్బారెడ్డి చేయించారు. అనంతరం గాంధీ బొమ్మ పరిసర ట్రంకు రోడ్డు ప్రాంతాలలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని మేయరు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనరు డిల్లీ రావు, టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, మెప్మా పిడి చిరంజీవి, కార్పొరేటర్లు దాసరి రాజేష్, ఉచ్చి భువనేశ్వర్, మేకల రామ్మూర్తి, మల్లెబోయిన వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, జియా ఉల్ హక్, కార్పోరేషను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY