స్టాలిన్‌నే స‌మ‌ర్ద‌వంత‌మైన నాయ‌కుడు-త‌మిళ ప్ర‌జ‌ల మ‌నోగ‌తం

0
241

చెన్నైః ఆమ్మ‌(జయలలిత) మరణం తర్వాత తమిళ రాజకీయాలు ర‌చ్చ రచ్చ‌గా మారాయి. అధికార పార్టీలో నిత్యం కీచులాటలతో నాయ‌కులు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇదే అదునుగా కొందరు హీరోలు స్వ‌ర్గీయ జ‌య‌ల‌లిత‌ స్థానాన్ని తాము భర్తీ చేయాలని ఆలోచనతో ఉన్నారు. రజనీకాంత్‌ పార్టీ పెట్టేస్తారని ఒక వైపు ప్రచారం జరుగుతుండ‌గా, ఆయన మాత్రం ఇంకా పార్టీ పెడితే బాగుంటుందా లేదా అని జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నారు.మ‌రో న‌టుడు కమల్‌ హసన్‌ అయితే ట్వీట్టర్‌ను నమ్ముకుని నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా తమిళనాడు ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు చెన్నై లయోలా కాలేజ్‌ విద్యార్థులు సర్వే నిర్వహించారు. ఇందులో తమిళనాడు ప్రజలు డీఎంకే వైపు మొగ్గ చూపారు. సినీ నటులపై తమిళ ప్రజలు కూడా గతంలో లాగా గుడ్డిగా మోజు పెంచుకోవడం లేదు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే స్టాలిన్ సీఎం కావాలంటూ ఏకంగా 41 శాతం మంది ప్రజలు ఆకాక్షించారు. తమిళనాడు రాజకీయం సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే స్టాలిన్ నాయకత్వమే సరైన మార్గమని వారు నమ్ముతున్నారు. స్టాలిన్‌కు పోటీ ఇచ్చే వారు దరిదాపుల్లో కనిపించడం లేదు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే బాగానే ఉంటుందని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. కమల్‌హసన్‌కు 13 శాతం మంది మద్దతు తెలిపారు.
ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు పన్నీర్ సెల్వం అసలు ఊసులోనే లేరు. వారిని తమిళప్రజలు చీదరించుకుంటున్నారు. పన్నీర్‌ సెల్వానికి ఒక శాతం ప్రజలు మద్దతు తెలిపారు. అయితే అనూహ్యంగా దినకరన్‌కు 10 శాతం మద్దతు లభించడం గమనార్హం. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డీఎంకే ఘన విజయం సాధించడం ఖాయంగా భావిస్తున్నారు.

LEAVE A REPLY