సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగులకు ఈనెల 25 నుండి క్రీడా పోటీలు

0
127

నెల్లూరుః సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగుల కొర‌కు జిల్లా,రాష్ట్ర స్దాయిలో నిర్వ‌హిస్తున్న క్రీడా ఎంపిక‌ల‌కు గ్రామ పంచాయితీ స్దాయి నుండి క‌లెక్ట‌రేట్ స్దాయి వ‌ర‌కు సివిల్ స‌ర్వీసెస్ శాఖాలకు చెందిన ఉద్యోగులంద‌రూ త‌ప్ప‌కుండా పాల్గొన్నాల‌ని జిల్లా క్రీడాపాధికార సంస్ద అధికారి పి.వి.ర‌మ‌ణ‌య్య తెలిపారు.జిల్లా క్రీడాప్రాధికార సంస్ద‌లు జిల్లా స్దాయిలో జ‌రిగే ఎంపిక‌ల‌కు క్రీడా ప‌రిక‌రాలు,ఇత‌ర సౌక‌ర్యాల‌ను స‌మ‌కూరుస్తు ఎంపిక‌ల కార్య‌క్ర‌మాన్ని అక్టోబ‌రు 18వ తేదిలోపు పూర్తి చేస్తామ‌న్నారు.అక్టోబ‌రు 25 నుండి 27వ తేది వ‌ర‌కు షెడ్యూల్ తెలిపిన ప్ర‌కారం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.సివిల్ స‌ర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులంద‌రూ జిల్లా స్దాయి ఎంపిక‌ల‌కు త‌మ పేర్ల న‌మోదు చేసుకోవాల‌సిందిగా శాప్ వైస్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ న‌ల్ల‌పురాజు.బంగార్రాజు తెలిపార‌న్నారు.జిల్లా స్దాయి ఎంపికైన వారు రాష్ట్ర ఎంపిక‌ల్లో పాల్గొంటార‌న్నారు.

LEAVE A REPLY