సావిత్ర‌యిభాయిపూలే జ‌న్మ‌దినోత్సం-గంటా

ప‌థ‌కాల‌న్ని ప్రారంభిస్తాం

నెల్లూరుః దేశంలోనే మొద‌టి సారిగా సావిత్ర‌యిభాయిపూలే జ‌న్మ‌దిన సంద‌ర్భంగా జ‌న‌వరి-3వ తేదిన మ‌హిళాఉపాధ్యాయ దినోత్స‌వం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర మాన‌వ వ‌నుర‌ల శాఖ మంత్రి గంటా.శ్రీనివాస‌రావు తెలిపారు.మంగ‌ళ‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక లోటులో వున్న‌ప్ప‌టికి విద్య‌కు ప్ర‌ధాన స్ధానం క‌ల్పించి బ‌డ్జెట్‌లో 17.5 నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.విద్యావ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసేందుకు 12 వేల మంది ఉపాధ్యాయుల‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.అలాగే పాఠ‌శాల్లో మౌళిక వ‌సుతులు క‌ల్పించేందుకు 4 వేల కోట్ల మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు ఉన్న‌ట్లు తెలిపారు.బ‌డి రుణం తీర్చుకుందాం కార్య‌క్ర‌మాం ద్వారా 10 కోట్ల మేర‌కు నిధ‌లు స‌మకురాయ‌న్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పాఠ‌శాల్లో డిజిట‌ల్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌కై 100 కోట్లు వెచ్చించ‌డం జ‌రుగుతుంద‌ని,అందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వాటాగా 70 కోట్లు ఎన్‌,ఆర్‌.ఐల ద్వారా 30 కోట్లు వాటాగా వుంద‌న్నారు.ప్ర‌తి రెవెన్యూ డివిజ‌న్‌లో ఒక మోడ‌ల్ స్కూల్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని,తొలుత విశాఖ‌ప‌ట్ట‌ణంలోని మ‌ధుర‌వాడ‌లో మొద‌లి మోడ‌ల్ స్కూల్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.రాష్ట్రంలోని 175 నియోజ‌కవ‌ర్గాల నుండి ఇద్ద‌రు హెడ్ మాస్ట‌ర్ల‌ను గుర్తించి,మొత్తం 350 మందికి రాష్ట్ర స్థాయిలో వ‌ర్క్ షాపు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో డిఇఓ మువ్వ‌.రామ‌లింగం త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY