*సామాజిక స్మగ్లర్లు* పుస్త‌కాన్ని వెంట‌నే నిషేధించాలి-ఆర్య‌వైశ్య సంఘాలు

0
247

కర్నూలుః వైశ్యులపై వివాదాస్పద పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్య వైశ్యుల హక్కుల సాధన సమితి ఏపీ అధ్యక్షులు టిజి భరత్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులపై రాసిన పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కంచ ఐలయ్యను అరెస్టు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు-కొమటోళ్లు’ అనే పుస్తకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.భారతదేశంలో ఉత్పత్తి కులాలకు తగిన గౌరవం దక్కలేదని వాదించే ఐలయ్య,ఇక్కడి కులాల మధ్య వైషమ్యాలను వారి వారి స్థితి గతులను తన రచనల ద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే మాలల తత్వం, మాదిగల తత్వం పేర్లతో పుస్తకాలు వెలువరించిన ఆయన అదే బాటలో వైశ్య సామాజికవర్గంపై * సామాజిక స్మగ్లర్లు* అంటూ పుస్తకాన్ని వెలువరించారు.పుస్తకాన్ని నిషేధించడంతో పాటు రచయిత, పబ్లిషర్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలకి దిగిన ఆర్యవైశ్యులు,ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్డం చేశారు. ఒక సామాజిక వర్గాన్ని విమర్శించే హక్కు నీకెవరిచ్చారని ఆర్య వైశ్యులు ఐలయ్యను నిలదీస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్చకు అర్థం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.ఐలయ్య పుస్తకంలోని అవాస్తవాలపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని, ఆర్యవైశ్యులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY