శ్రీహ‌రి కోట‌లో ప‌ర్యాటించిన ఎస్సీ,ఎస్టీ క‌మీష‌న్‌

0
254

నెల్లూరుః రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ క‌మీష‌న్ ఛైర్మ‌న్ కారెం.శివాజి మ‌రియు స‌భ్యులు సోమ‌వారం శ్రీహరికోట షార్‌లో ప‌ర్యాటించారు.తొలుత షార్‌లోని ఎస్సీఎస్టీ ఉద్యోగుల‌తో స‌మావేశ అనంత‌రం ముఖ్య క‌మాండ్ కంట్రోల్‌రూము,మొద‌టి రాకెట్‌ప్ర‌యోగ వేదిక‌,2వ రాకెట్ ప్ర‌యోగ వేదిక‌,టెలిమెట్రి ,మ్యూజియంల‌ను వీక్షించారు.షార్ డిప్యూటివ్ డైర‌క్ట‌రు కె.పొంగిన‌న్ ప్ర‌యోగ వేదిక‌లు,టెలిమెట్రిక్ త‌దిత‌ర అంశాల గురించి వివ‌రించారు.అనంత‌రం సిబ్బందితో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఉద్యోగ నియామ‌కాలు మ‌రియు ప‌దోన్న‌తుల ఎస్సీ,ఎస్టీ రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ అమలుపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.షార్‌లో రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ అముచేయ‌డం సంతృప్తిని వ్య‌క్త ప‌ర్చారు.అనంత‌రం ఎస్సీ,ఎస్టీ కాల‌నీల్లో ప‌ర్యాటించి వారి సాధ‌క బాధ‌కాల‌ను అడిగి తెలుసుకున్నారు.ఈకార్య‌క్ర‌మంలో క‌మీష‌న్ స‌భ్యులు న‌ర‌హ‌రి వ‌ర‌ప్ర‌సాద్‌,సుధారాణి, ర‌వీంద్ర‌,సోమ‌ల‌తోపాటు షార్ డైరక్ట‌ర్ కున్హికృష్ణ‌న్‌,నాయుడు పేట ఆర్‌డిఓ శీనా నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY