విప‌క్షాల రాష్ట్రప‌తి అభ్య‌ర్ది మీరాకుమార్‌..

0
401

అమ‌రావ‌తిః ఏకగ్రీవం కావాల్సిన రాష్ట్రపతి ఎన్నికకు పోటీ తెర‌లేచింది..ప్రధాని మోడీ రాజకీయ చతురతతో ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామనాధ్ కోవింద్ ని ప్రకటించి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టుకునేందుకు సన్నాహాలు చేస్తుకుటుంది.అయితే తమని సంప్రదించకుండా ఎన్డీయే అభ్యర్థిగా రామనాధ్ కోవింద్ ని ప్రకటించారని,నింద మోపుతూ కినుక వహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ని విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు.
జాతీయ స్థాయిలో 17 పార్టీల నేతలు హాజరైన గురువారం నాటి విపక్షాల కీలక భేటీలో మీరాకుమార్ ని ఎంపిక చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ హౌస్ లైబ్రరీ లో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్ పటేల్ తో పాటు ఎన్సీపీ తరఫున శరత్ పవర్, ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా, డీఎంకే నేత కనిమొళి, నేషనల్ కాన్ఫెరెన్స్ తరఫున ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. మే 26న జరిగిన సమావేశానికి హాజరయిన తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, బీఎస్పీయే నేత మాయావతి, ఎస్పీయే నేత అఖిలేష్ యాదవ్ ప్రస్తుత సమావేశానికి గైర్హాజరయ్యారు.వారి ప్రతినిధులు మాత్రం హాజరయ్యారు. జేడీఎస్, ఆర్ ఎస్పీ, జీఎంఎం, కేరళ కాంగ్రెస్, ఐయూఎంఎల్, అస్సామ్ కి చెందిన ఏఐయూడీఎఫ్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ 5 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గతంలో లోక్ సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్డీయే అభ్య‌ర్ది విజ‌యం దాదాపుగా ఖ‌రారు అయిన్ప‌టికి,రాష్ట్రప‌తి ప‌ద‌వీకి పోటీ అన్న విష‌యంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

LEAVE A REPLY