విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు-క‌లెక్ట‌ర్‌

0
189

వైద్యాధికారుల‌కు హెచ్చ‌రిక‌…
నెల్లూరుః జిల్లాలోని పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య‌సేవలు అందించాల్సిన బాద్య‌త వైద్య‌శాఖాధికారుల‌పైన వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు అన్నారు.విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు. గురువారం మాతా శిశు మ‌ర‌ణాల‌పై వైద్యాధికారుల‌తో అయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన సంద‌ర్బంలో మాట్లాడుతూ జిల్లాలో సంభ‌వించిన 13 మాతృమ‌ర‌ణాలు,8 శిశు మ‌ర‌ణాలు ప్ర‌తి మ‌ర‌ణం ఎలా సంభ‌వించింది,ఎక్క‌డ సంభ‌వించింది అనే ఆంశంపై సంబంధిత వైద్యాధికారుల‌తో స‌మీక్ష‌ఙంచారు.గుర్తించిన కార‌ణాలు నివారించ‌వ‌ల‌సిన‌వైతే స‌రిదిద్దుకోవాల‌న్నారు. ఓజిలిలో గ‌ర్బ‌వ‌తి అయ‌న మైన‌రు బాలిక మ‌ర‌ణం,అమె భ‌ర్త‌పై క్రిమిన‌ల్‌కేసు న‌మోదు చేసి త‌న‌కు స‌మాచారం తెలియ‌చేయాల‌ని,ఐ.సి.డి.ఎస్‌,సి.డి.పి.ఓను అదేశించారు.ఐ.సి.డి.ఎస్ వారు గ్రామాల్లో మైన‌రు బాలిక‌ల‌కు వివాహాలు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.పి.హెచ్‌.సిల్లో ప‌నిచేసే వైద్యాధికారులు ప్ర‌జ‌ల‌యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్య‌యుతంగా ప‌నిచేసి మాతా శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ల‌న్నారు. ఈ స‌మావేశంలో వైద్యాధికారి వ‌ర‌సుందరం,డి.సిహెచ్.ఎస్ స‌బ్బారావు,ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY