రైతులు రుణ‌మాఫీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొవ‌చ్చు-జాయింట్ క‌లెక్ట‌ర్‌

0
229

నెల్లూరుః రైతు రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టి అమ‌లు చేస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.శుక్ర‌వారం అయ‌న చాంబ‌ర్లో 3వ విడ‌త రుణ‌మాఫీపై అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.ఈసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ ఈనెల 14వ తేది ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌రకు జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాలయంలోని ప్ర‌జావిజ్ఞాప్తుల స‌మావేశం మందింరంలో 3 మూడ‌వ విడ‌త రుణ‌మాఫీ ప‌థ‌కం గురించి,ప్ర‌త్యేక ప్ర‌జావిప్తుల దినం నిర్వ‌హిస్తున్న‌మ‌న్నారు. ఈకార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖామంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా పాల్గొని వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటార‌న్నారు.రుణ‌మాఫీ ఆర్హ‌త క‌లిగివుండి సాంకేతిక కార‌ణాల వ‌ల్ల రుణ‌మాఫీ పొంద‌లేక‌పొయిన రైతులు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంకు వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌న్నారు.

LEAVE A REPLY