రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి- పురంధేశ్వ‌రి

0
211

క‌ర్నూలుః రాయలసీమకు ఇప్పటి వరకు కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే వచ్చిందని, సీమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని బార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి డి.పురందేశ్వరి అన్నారు.ఆదివారం కోడుమూరులో భాజపా కార్యకర్తలు నిర్వహించిన‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంద‌ర్బంలో అమె మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర కరవు ఏర్పడిందన్నారు.వెనుకబడిన రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి కేంద్రప్రభుత్వం ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ. 1,050 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కృషి సంచాయి యోజన ఏర్పాటు చేసిందన్నారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి అభివృద్ధికి సంబంధించి 8 అంశాలు రాగా అందులో రాయలసీమకు సంబంధించి ఒక్కటి కూడా లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనధార అయిన పోలవరానికి జాతీయ హోదా కల్పించిన భాజపా ప్రభుత్వం,దాని నిర్మాణం కోసం పూర్తి నిధులు అందిస్తుంద‌న్నారు.2018 నాటికి రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉందన్నారు. అనంతరం స్థానికంగా తాగునీటి కష్టాలపై కోడుమూరు ప్రజలు ఆమెకు తెలిపారు. చేనేత మహిళలు పురందేశ్వరిని పట్టువస్త్రాలతో సత్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, భాజపా నాయకులు హరీష్‌బాబు, విజయ్‌యాదవ్‌, మల్లేష్‌, రమేష్‌బాబు, మల్లేష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY