మాన‌సిక ఒత్తిడి త‌ట్టుకోలేక‌-మెడికో ఆత్మ‌హ‌త్య‌

0
269

అనంత‌పురంః మానసిక ఒత్తిడి త‌ట్టుకోలేక మ‌రో విద్యార్ది నిండు ప్రాణాలు కోల్పోయాడు.అనంత‌ర‌పురం ప‌ట్ట‌ణంలోని మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న యశ్వంత్‌ అనే విద్యార్థి లక్ష్మీనగర్‌ సమీపంలో గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘ‌ట‌న స్ద‌లంకు చేరుకున్న‌ రైల్వే పోలీసులు,మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.యశ్వంత్‌ స్వస్థలం హిందూపురం సమీపంలోని చోళసముద్రం.అతడి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కాలేజ్‌లో చేరినప్పటి నుంచి యశ్వంత్‌ తీవ్ర మాన‌సిక‌ ఒత్తిడికి గురవుతున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నందున కుటుంబసభ్యులు కూడా యశ్వంత్‌తోనే ఉంటున్నారు. గురువారం పరీక్షలు ముగుస్తుండ‌డంతో,అతడు ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిచివేసింది,,ఈ ప్రపంచంలో నేను ఉండలేను అని యశ్వంత్‌ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న‌ రైల్వే పోలీసులు ,కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY