మాజీ మంత్రి జ‌యంతి న‌ట‌రాజ‌న్ ఇంటిలో సిబిఐ సోదాలు

0
79

చెన్నైః ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కురాలు, మాజీ ప‌ర్యావ‌ర‌ణ శాఖా మంత్రి జ‌యంతి న‌ట‌రాజ‌న్ ఇంటిలో శ‌నివారం సిబిఐ సోదాలు చేస్తోంది. ఆమె మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. చెన్నైలో ఆమెకు సంబంధించిన వివిధ ప్ర‌దేశాల‌లో ఆధారాల కోసం సిబిఐ గాలింపు చేప‌ట్టింది. ఆమె ప‌ర్యావ‌ర‌ణ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రెండు ప్ర‌యివేట్ కంపెనీల‌కు అట‌వీ భూముల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా క‌ట్ట‌బెట్టిన‌ట్లు గుర్తించిన ద‌ర్యాప్తు సంస్థ అధికారులు మ‌రిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు.
జ‌యంతి న‌ట‌రాజ‌న్ అనుమ‌తినిచ్చిన రెండు కంపెనీలు జార్ఖండ్‌లో అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తేలింది. ఆమె అనుమ‌తిచ్చిన కంపెనీల‌లో ఒక‌టి జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ లిమిటెడ్ కాగా రెండోది జెఎస్‌డ‌బ్య్లూ స్టీల్ లిమిటెడ్‌. ఈ కంపెనీల‌కు అనుమ‌తులు మంజూరు చేసిన అధికారుల‌పై ఇప్ప‌టికే కేసులు న‌మోదు చేసిన ద‌ర్యాప్తు సంస్థ, ప్ర‌స్తుతం జ‌యంతి న‌ట‌రాజ‌న్ నుంచి మ‌రిన్ని నిజాలు రాబ‌ట్టే ప‌నిలో ఉంది.

LEAVE A REPLY