బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాని త్యాగం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే-కామినేని

0
377

విజయనగరం జిల్లాః బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాని అయ‌న భార్య సావిత్రిబాయిపూలేతో క‌ల‌సి త్యాగం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.మంగ‌ళ‌వారం విజయనగరం టౌన్ లో జ్యోతిరావుపూలే 191జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి వెంకట సుజయ కృష్ణ రంగారావుతో క‌ల‌సి పూలమాల వేసిన ఘ‌నంగా నివాళిర్పించారు.ఈసంద‌ర్బంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ప్ర‌భుత్వం 10 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించాద‌న్నారు.అనంత‌రం అయ‌న జియ్యమ్మవలస మండలం చినమేరంగి సీహెచ్ సీ నూతన భవనం (ఐ.పి విభాగం) ను ప్రారంభించారు.ఈకార్య‌క్ర‌మంలో మంత్రి ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు,జడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్సీలు శత్రుచర్ల విజయరామరాజు, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY