ప‌సుపు కొనుగొలుకు రైతుల‌కు క‌డ‌ప‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు-సోమిరెడ్డి

0
358

నెల్లూరుః ప‌సుపు కొనుగొలుకు రైతుల‌కు క‌డ‌ప‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్ సోమ‌వారం నుండి ఏర్పాటు చేయ‌డం ద్వారా కొనుగోలు ప్రారంభిస్తామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి తెలిపారు.గురువారం కొండాయ‌పాళెం పంచాయితీ,మాసాయిపేట గ్రామంల ఉద‌య‌గిరి మండ‌లంలో నీరు-చెట్టు కార్య‌క్ర‌మం క్రింద 32 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో నిర్మించిన ఫైబ‌ర్ గేటెడ్‌చెక్ డ్యాం (ఉళ్ల‌వంక ఫైబ‌ర్‌చెక్ డ్యాం) ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో అయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో వ్య‌వసాయ యాంత్రీక‌ర‌ణ‌కై 450 కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్లు చెప్పారు.మైక్రో,డ్రిప్‌, స్ర్పింకిల్ వ్య‌వ‌సాయానికి సంబంధించి 470 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు అన్నారు.భావిత‌రాల‌ను,భ‌విష్య‌త్తును దృష్టిలో వుంచుకుని,ప‌ర్యావ‌ర‌ణం,జ‌ల‌వ‌న‌రుల‌ను కాప‌డుకోవాల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఇరిగేష‌న్ మంత్రి దేవినేని మాట్లాడుతు కేవ‌లం ఉద‌య‌గిరి నియోజ‌వ‌ర్గంలో 560 చెక్ డ్యాం నిర్మాణ చేప‌ట్ట‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు.దేశంలో మ‌రెక్క‌డ‌లేని విధంగా జ‌ల‌దంకిలో ఏర్పాటు చేసిన ఫైబ‌ర్‌చెక్ డ్యాం ఒక న‌మూనాగా నిలిచింద‌ని అన్నారు.వెలుగొండ ప్రాజెక్ట్ ప‌నుల‌ను 2018 నాటికి పూర్తి చేసే విధంగా,రెండ‌వ వైపు నుండి కూడా ట‌న్న‌ల్ ప‌నున‌లు ప్రారంభించ‌డానికి టెండ‌ర్లు పిల‌వ‌డ జ‌రిగింద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో స్ధానిక ఎమ్మేల్యే బి.రామారావు,ఎఎంసి ఛైర్మ‌న్ చంద్ర‌మ‌ధుసూద‌న్‌,కంభంపాటి.విజ‌య‌రామిరెడ్డి,ఇరిగేష‌న్ అధికార‌లు,ఎంపిపిలు,జ‌డ్పీటిసిలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY