ప‌రిశ్ర‌మ‌ల స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి పరిష్కరిస్తాం-క‌లెక్ట‌ర్‌

0
382

నెల్లూరుః ఎస్సీ,ఎస్టీ ఔత్స‌హిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు అన్నారు.గురువారం స్దానిక క‌స్తూర్బా క‌ళాక్షేత్రంలో సూక్ష్మ‌,చిన్న‌,మ‌ధ్య‌,త‌ర‌హా పరిశ్ర‌మ‌ల స‌మ్మేళ‌నం జ‌రిగింది.ఈ స‌మ్మేళ‌నంలో బ్యాంకులు నుండి చిన్న‌,మ‌ధ్య త‌ర‌హాప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలు పొంద‌డంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు,ప్ర‌స్తుతం జిల్లాలో న‌డుస్తున్న పరిశ్ర‌మ‌ల ప‌రిష్కారం, స్టాండ‌ప్ ఇండియా,పి.ఎం.ఇ.జి.పి,ముద్ర మొద‌లైన ప‌థ‌కాల ద్వారా ప‌రిశ్ర‌మ‌ల స్దాప‌న ఖాయలా ప‌రిశ్ర‌మ‌ల పున‌రుద్ద‌ర‌ణ నూత‌న పారిశ్రామిక విధానం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై స‌మావేశం జరిగింది.ఈస‌మావేశానికి ముఖ్యఅతిధిగా పొల్గొన్న క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వ‌చ్చిన 1947 సంవ‌త్స‌రం తొలి రోజుల్లో ఎక్కువ మంది ప్ర‌జ‌లు ఆహ‌రంలేక చ‌నిపోయేవార‌న్నారు.1950 నుండి ప్ర‌భుత్వం దృష్టి వ్య‌వ‌సాయ‌రంగం మీద పెట్టింద‌ని,ఇంకా దేశం త్వ‌ర‌గా అభివృద్ది చెందాలంటేభారీ ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హించింద‌న్నారు.ఈ త‌ర‌హాలోనే ఎం.ఎస్‌.ఎం.ఇని ప్రోత్స‌హింస్తుంద‌న్నారు.జిల్లాలో ప‌రిశ్ర‌మ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తినెల జ‌రిగే జిల్లా పరిశ్ర‌మ‌ల‌శాఖ క‌మిటీ స‌మావేశంలో చ‌ర్చించి,ప‌రిష్క‌రించే విదంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌,న‌బార్డు ఎజిఎం,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY