ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

0
197

అమ‌రావ‌తిః ప్రైవేటు బస్సు ప్రయాణం మృత్యుతో చెల‌గాటం మారింది.ప్రైవేట్ బ‌స్సు ఎక్కిన త‌రువాత మీరు అనుకున్న టైమ్‌కు గ‌మ్య‌స్దానంకు చేరుతారో లేదో తెలియ‌ని ప‌రిస్థితి.ఇటీవ‌ల యాత్రాజినీ బ‌స్సు విజ‌య‌వాడ‌కు స‌మీపంలో అగిపోయింది.దింతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో ర‌వాణాశాఖ‌ధికారులు క‌లుగ‌చేసుకుని,ప్ర‌యాణికుల‌ను వేరే బ‌స్సు ద్వారా గ‌మ్య‌స్ధానాల‌కు పంపేరు.తాజాగ‌ యాత్రాజినీ.కామ్ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాదు నుంచి చెన్నె వెళ్లుతున్న‌స‌మ‌యంలో, ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండ‌గా, గురువారం తెల్లవారు జామున ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం దగ్గర లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సై డ్రైవర్, క్లీనర్, అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటనలో మరో పదిమందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాధమికంగా తేలింది

LEAVE A REPLY