ప్ర‌భుత్వం మ‌హిళ‌ల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటుంది-సోమిరెడ్డి

0
130

నెల్లూరుః రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకొని వారి అభివృద్దికి నిధులు కేటాయించి తోడ్పాటు అందిస్తుంద‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.సోమ‌వారం తోట‌ప‌ల్లి గూడూరులోని డ్వాక్రా భ‌వ‌నంలో పొదుపుల‌క్ష్మి ప‌ర‌స్ప‌ర స‌హాయ స‌హకార సంఘం స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించారు.ముఖ్య‌మంత్రి 1995 సం..లో మ‌హిళా గ్రూపుల‌ను ప్రారంభిచి వాటికి ఒక రూపం తీసుకొచ్చార‌ని తెలిపారు.1999లో సంవ‌త్స‌రంలో 350 సంఘాలు వుండ‌గా అందులో స‌భ్యులు 4200 మంది వుండేవార‌ని,వార పొదుపు చేసుకున్న మొత్తం 3 కోట్ల 15 ల‌క్ష‌ల రూపాయ‌లు ఉండేద‌న్నారు.2017 సంవ‌త్స‌రంలో 3,38,50000 ల‌క్ష‌ల రూపాయ‌లు రుణాలు ఇచ్చార‌న్నారు.చంద్ర‌న్న పెట్టుబ‌డి నిధికి ఇప్ప‌టి వ‌ర‌కు 6 వేల కోట్ల రుణాలు పంపిణీ జ‌రిగింద‌ని,ఇంకా 4 వేల కోట్ల రూపాయలు అక్టోబ‌రు నాటికి పంపిణీ జ‌రిగే ఆవ‌కాశం వుంద‌న్నారు.ప్ర‌తి ఒక్క‌రు మ‌రుగుదొడ్లు నిర్మించుకొవాల‌న్నారు.తొలుత పాపిరెడ్డి పాళెంలో వ‌నం-మ‌నం కార్య‌క్ర‌మంలో బాగంగా మొక్క‌లు నాటారు.ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ అధికారులు,నాయ‌కులు పాల్గొన్నారు.

LEAVE A REPLY