ప్ర‌తిప‌క్షం కుట్ర‌లు సాగ‌నివ్వం-అభివృద్ది ధేయ్యంగా పాల‌న‌-మంత్రి లోకేష్‌

0
211

విజ‌య‌న‌గ‌రంః విభ‌జించి పాలించు అన్న బ్రిటీష్ సిద్దంతాని,రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.మంగ‌ళ‌వారం విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తండ్రీ కొడుకుల మధ్య చిచ్చుపెట్టాలని దొంగ పత్రిక, ఛానల్‌ అనేకసార్లు ప్రయత్నించాయని ఆరోపించారు.పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారని, ఆ అవకాశం తనకు చిన్న వయసులోనే వచ్చిందని లోకేశ్‌ అన్నారు. 2014లో ఆదాయం ఒక రాష్ట్రానికి ఇచ్చి, అప్పు మన నెత్తిన వేశారని చెప్పారు. అపార అనుభవం ఉన్న చంద్రబాబు లోటు లేకుండా పరిపాలన అందిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ చేసి చూపించామని, డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన మరో రూ.4వేలు కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని వెల్లడించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 658 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, ఒక్క శృంగవరపుకోటలోనే 171 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు.2 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్లతో లింక్‌ రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామని, 2019 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి గ్రామానికీ ఎల్‌ఈడీ బల్బులు అందజేస్తామన్నారు.మంత్రి లోకేష్ విజ‌య‌న‌గ‌రం, తుర్పూగోదావ‌రి జిల్లాల్లో నేటి నుండి రెండు రోజుల పాటు ప‌ర్యాటించ‌నున్నారు.జిల్లాకు చేరుకున్న లోకేష్‌కు మంత్రి సుజ‌య్‌కృష్ణ‌రంగావు,ఎమ్మేల్యే,ఎమ్మేల్సీలు,పార్టీ నాయ‌కులు ఘ‌నస్వాగ‌తం పలికారు.

LEAVE A REPLY