ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉన్నాయి-వైసిపి అధినేత జ‌గ‌న్‌

0
302

పశ్చిమగోదావరిః ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయని,ఎవరో ఒకరు తప్పు చేసినంత‌మాత్ర‌నా, ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదని హితవు పలికారు. శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నని,స్వ‌యంగా జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానని జగన్ చెప్పారు.తాను రెండు పక్షాలతోనూ మాట్లాడతానని, సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే తన అభిప్రాయంమ‌న్నారు.ఇందు కోసమే ఈ ప్రయత్నమని,ఇది అన్నివర్గాలకు వర్తిస్తుందన్నారు. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే,దాన్ని సరిదిద్దుకుందామని,దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదన్నారు.ఈ సందర్భంగా గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ,సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామని,అయితే కొందరు వల్ల ఈ సమస్య వచ్చిందని తెలిపారు తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందని, సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయని వివరించారు.

LEAVE A REPLY