పోల‌వ‌రం కాప‌ర్ డ్యామ్ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్దాప‌న‌-ప్ర‌జ‌సేవాకోస‌మే జీవితం అంకితం-చంద్ర‌బాబు

0
491

క‌రువును నివారించ‌డమే ల‌క్ష్యం…

ఫోల‌వ‌రంః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుక‌న్న వ్య‌వ‌ధిలో పోల‌వ‌రం నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసేందుకు అధికారుల‌ను,కాంట్రాక్ట‌ర్ల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు అనేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌ ఛానల్‌ నిర్మించే ఐకాన్‌ వంతెన, గోదావరి నదిపై నిర్మించే కాఫర్‌ డ్యామ్‌ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. కాఫర్‌ డ్యామ్‌ పనుల కోసం తీసుకొచ్చిన జెట్‌ గ్రౌంటింగ్‌ యంత్రాన్ని సీఎం ప్రారంభించారు.న‌వ్యంధ్ర‌ప్ర‌దేశ్ పునఃర్ నిర్మాణ పనులు చేపట్టి మూడేళ్లు పూర్తయిన జూన్‌ 8నే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన కాఫర్‌ డ్యామ్‌ పనులకు శంకుస్థాపన చేయడం చెప్పుకొత‌గ్గ విష‌యం.
ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని,,మట్టిపనులు 70శాతం పూర్తయ్యాయని.. డయాఫ్రం వాల్‌ పనులు కూడా ఈ సీజన్‌కు 50 శాతం పూర్తి చేస్తామన్నారు. 48గేట్ల పనులు అనుకున్న ప్రకారం జరుగుతున్నాయన్నారు. పోలవరం పనుల్లో 4వేల మంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీగా.. సీజన్‌ వారీగా లక్ష్యాలు పెట్టుకుని ప‌నిచేస్తున్న‌మ‌న్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కేరళను తలపించే ప్రకృతి అందాలున్నాయని.. పర్యాటకంగా వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప‌నుల‌కు అన్నీ అనుకూలిస్తున్నాయని.. దీంతో అనుకున్న సమయానికే దీన్ని పూర్తిచేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. పోలవరం పూర్తయితే రాజకీయంగా తమకు పుట్టగతులు ఉండవని వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు ఆందోళన చెందుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు.
పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 నాటికి నీరివ్వాలనే ముఖ్య‌మంత్రి సంకల్పం నెరవేరడంలో కాఫర్‌ డ్యామ్‌ది కీలక పాత్ర. వాస్తవానికి ప్రధాన ప్రాజెక్టు అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తికావడానికి ముందు కాఫర్‌ డ్యామ్‌ ద్వారా నీరివ్వాలనే చంద్ర‌బాబు ల‌క్ష్యం.. పోలవరం ప్రాజెక్టు సమీక్ష జరుగుతున్నప్పుడు కీలక ప్రతిపాదన తీసుకొచ్చిన సమయంలో ఆయన ఆలోచనకు ఇంజినీర్లు ఒక రూపం ఇచ్చారు. చంద్రబాబు వెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, పలువురు అధికారులు ఈకార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY