పోలీసు కానిస్టేబుల్స్ స్టోరీ-2

0
282

ఈ వ్య‌వ‌స్థ‌ల‌న్ని మెరుగైన ఫ‌లితాలు సాధించేందుకు,ఉన్న‌త‌ధికారుల ఆలోచ‌న‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో ఆమ‌లుచేసే కానిస్టేబుల్స్‌ వ్య‌వ‌స్థ‌లో మొద‌టి నుండి కొంత ఆసంతృప్తి గూడుక‌ట్టుకుని ఉంది.పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌లో క్రెమ్‌,లా అండ్ ఆర్డ‌ర్‌,ట్రాఫిక్ ప్ర‌జ‌ల ముందు క‌న్పిస్తుంటాయి.ఇవి కాకుండా స‌మాజంలో ఆసాంఘిక శ‌క్తులు చేల‌రేగి పోకుండా,నిరంత‌రం నిఘావుంచి,ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మాచారంను ఉన్న‌త‌ధికారుల‌కు చేర‌వేసి నిఘా వ్య‌వ‌స్థ‌లు తెర‌వెనుక కంటి రెప్ప‌వేయ‌కుండా ప‌నిచేస్తుంటాయి.విధ్యాధికులైన కానిస్టేబుల్స్ శిక్ష‌ణ స‌మ‌యంలో నేర‌ప‌రిశోధ‌న‌పై ఇచ్చిన శిక్ష‌ణ అటు త‌రువాత కాలంలో కొంత నిర్ల‌ప‌త్త‌కు గురిఆవుతుంది.నేర ప‌రిశోధ‌న‌లో కానిస్టేబుల్స్‌కు త‌గిన ప్రాధాన్యం,వారిని స‌రైన దిశ‌గా ప్రోత్స‌హిస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి.వ్య‌వ‌స్థ‌లో చోటుచేసుకున్న ఇజం వ‌ల్ల‌,నేర ప‌రిశోధ‌న‌లో కానిస్టేబుల్స్ త‌క్క‌వ‌గా వుండ‌డం,కేసుల మిస్ట‌రీని చేధించ‌నప్ప‌టికి,పై స్థాయి అధికారుల‌కే పేరు రావ‌డంలాంటి ఘ‌ట‌న‌ల వ‌ల్ల‌,నేర ప‌రిశోధ‌న కొంత ప‌క్క‌దారి ప‌డుతుంద‌ని,దిని వ‌ల్ల నేరాలు చేసే వ్య‌క్తుల‌కు చ‌ట్టంకు దొర‌కుండా త‌ప్పించుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.
కానిస్టేబుల్స్ విదినిర్వ‌హ‌ణ‌లో పైకి క‌న్పించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర్కొవ‌డం నిత్యాకృత్యం అయిపొయింది.నేరానికి సంబంధించిన విష‌యంలో స‌మాచారం రాబట్టాలంటే,చాలా దూరుం తిర‌గాల్సివుంటుంది.కాలంతో స‌మానంగా ప‌రుగులు తీస్తున్న ప్ర‌స్తుత రోజుల్లో సైకిల్‌పై తిరిగి స‌మాచారం సేకరించే రోజులు పోయాయి.ఖ‌చ్చితంగా మోట‌ర్‌బైక్ తిర‌గాలి,అనుమానితుల‌ను స్టేష‌న్‌కు తీసుకుని రావ‌లి.పెట్రోల్ ఖ‌ర్చుల‌కు డ‌బ్బు ఏవ‌రు ఇస్తారు ? కానిస్టేబుల్ నెల‌లో 20 రోజుల పాటు రాత్రి పూట బీట్ తిగాల్సి వుంటుంది.మ‌రి ఈ బీట్ డ్యూటీ చేసేందుకు ప్ర‌భుత్వం చెల్లించే అల‌వెన్స్ పేరు (సైకిల్ అల‌వెన్స్‌)కేవ‌లం నెల‌కు 200 రూపాయ‌లు.మోట‌ర్‌బైక్ పైన తిర‌గ‌లంటే క‌నీసం రోజుకు 100 రూపాయ‌లు కావాలి.అంటే నెల‌కు దాదాపుగా 2 వేల రూపాయ‌లు ఖ‌ర్చు,,మ‌రి ఇది ఏవ‌ర‌కు భ‌రించుకొవాలి.అలాగే దొంగ‌త‌న‌లు జ‌రిగిన‌ప్ప‌డు,సంబంధిత సంఘ‌ట‌న గురించి స‌మాచారం సేక‌రించేందుకు ఇన్‌ఫార్మ‌ర్స్ వ్య‌వ‌స్థను ఉప‌యోగించుకొవాల్సివ‌స్తుంది.మ‌రి స‌మాచారం అందించే వ్య‌క్తికి ఎంతో కొంత ముట్ట‌చెప్ప‌క త‌ప్ప‌దు,ఈ ఖ‌ర్చు ఏవ‌రు భ‌రించాలి ? అలాగే కానిస్టేబుల్స్‌కు ప్ర‌భుత్వం ఇచ్చే సెల‌వుల విష‌యంలో స్టేష‌న్‌లోని పై అధికారికి మొర‌పెట్టుకొవాల్సిందే.స‌ద‌రు అధికారికి మూడ్ బాగ‌వుంటే శెల‌వు ఇస్తాడు లేదంటే డ్యూటీ చేయాల్సిందే.ఎందుకంటే వీరు డిసిప్లిన్ ఫోర్స్ కాబ‌ట్టి,మిగిలిన ఏ ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌లో ఇలాంటి పరిస్థితి వుండ‌దు. క‌్రింది స్థాయిలో కానిస్టేబుల్స్ ఈలాంటి స‌మ‌స్య‌లను ఎదుర్కొంటుండగా,ఉన్న‌త‌స్థాయి అధికారులు ఈవిష‌యంపై ఎందుకు దృష్టిసారించ‌లేద‌నిది ప్ర‌శ్న‌ర్ధ‌కంగానే మిగిలిపోతుంది.సమ‌స్యకు ప‌రిష్కారం ఎప్ప‌డు వ‌స్తుందో వేచిచూడాల్సిందే ?

కానిస్టేబుల్స్ వ్య‌వ‌స్థః
కానిస్టేబుల్స్‌ను ఎంపిక స‌మ‌యంలోనే మూడు విభాగాలుగ ఎంపిక చేస్తారు.ఇందులో సివిల్‌,ఆర్మ‌డ్ రిజ‌ర్వ‌ర్‌,ఏపిఎస్‌పిలు.వీరి ఎంపిక విధానం ఒకటే అయిన,శిక్ష‌ణ స‌మయ‌లో సివిల్ అభ్య‌ర్దుల‌కు 9 నెల‌లు శిక్ష‌ణ ఇందులో 12 స‌బెక్జులు ఉంటాయి.వీరు ఖ‌చ్చితంగా లా పేప‌ర్ పాస్ కావ‌ల్సివుంటుంది.ఆర్మ‌డ్‌రిజ‌ర్వ అభ్య‌ర్దుల‌కు 6 నెల‌ల శిక్ష‌ణ వుంటుంది.వీరికి స‌బెక్ట‌లు ఒక‌టే అయిన‌ప్ప‌టికి లా పేవ‌ర్ ఖ‌చ్చితంగా పాస్ కావ‌ల్సి అవ‌స‌రం లేదు.అలాగే ఏపిఎస్‌పి అభ్య‌ర్దుల‌కు 6 నెల‌ల శిక్ష‌ణ వుంటుంది.వీరికి ఇదేవిధానం శిక్ష‌ణ వుంటుంది.సివిల్ విభాగం ఎక్కువ భాగం లా అండ్ ఆర్డ‌ర్ మొయిన్‌టెన్ చేయ‌డం, లా పేవ‌ర్‌లో వీరికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌డం వ‌ల్ల‌ నేర ప‌రిశోధ‌న‌లో చ‌ట్టబ‌ద్దంగా ఎలా ముందుకు పొవాలి అనే ఆంశంపై స్ప‌ష్ట‌మైన ఆవ‌గాహ‌న వుంటుంది.ఏఆర్‌,ఏపిఎస్‌పి విభాగ‌లు స‌మాజం శాంతి భద్ర‌త‌లు,విఐపిల సెక్యూరీటి,కోర్టు విధులు ఎక్కువ‌గా నిర్వ‌స్తుంటారు.

కానిస్టేబుల్స్ స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌డం,నేరం చేసిన వ్య‌క్తికి చ‌ట్ట‌ప‌రంగా స‌రైన శిక్ష ప‌డాలి అంటే సంబంధిత పోలీసుస్టేష‌న్ సిబ్బంది ఒక టీమ్ వ‌ర్క్‌గా ప‌నిచేస్తేనే సాధ్యం అవుతుంది.ఇందులో ఎక్క‌డ తేడా వ‌చ్చిన స‌ద‌రు కేసు నీరుగారిపోతుంది.కానిస్టేబుల్ మ‌మ అన్న విధంగా డ్యూటీ చేసిన‌ప్ప‌డు,మన‌స్పూర్తిగా డ్యూటీ చేస్తే వ‌చ్చే ఫ‌లితాల్లో ఎంతో తేడా వుంటుంది.ఉదాహ‌ణ‌కు,,ఒక నేరం జ‌రిగింద‌నుకుంటాము,ఎస్ఐ లేదా సిఐ స్థాయి అధికారి,నేరానికి సంబంధించి ఘ‌ట‌న‌లో కొంత మంది అనుమానితుల‌ను స్టేషన్‌కు తీసుకుని రావ‌ల్సిందిగా కానిస్టేబుల్‌న పుర‌మఇస్తారు.మ‌మ అన్న విధంగా డ్యూటీ చేస్తే కానిస్టేబుల్ అనుమానితుని వద్ద‌కు వెళ్లి స్టేష‌న్‌కు రావ‌ల్సిందిగా కొరుతాడు.అనుమానితుడు స‌ద‌రు కానిస్టేబుల్‌కు కుంటి సాకులు చెప్పి పంపించివేస్తాడు.కానిస్టేబుల్ స్టేష‌న్‌కు వ‌చ్చి అనుమానితుడు క‌న్పించ‌లేదని,అత‌ను క‌న్పించ‌గానే స్టేష‌న్‌కు తీసుకుని వ‌స్తాన‌ని పై అధికారికి చెపుతాడు.అదే కానిస్టేబుల్ మ‌న‌స్పూర్తిగా డ్యూటీ చేస్తే,అనుమాతుని స్టేష‌న్‌కు తీసుకుని వ‌చ్చేందుకు వెళ్లిన‌ప్ప‌డు,అత‌ను చెప్పే కుంటుసాకులు విని,ఒక్క‌సారి స్టేష‌న్‌కు వ‌చ్చి పై అధికారికి క‌న్పించి వెళ్లి పోవ‌చ్చు,అలా పంపించే పూచీ త‌న‌దంటు న‌యానో,భ‌యానో అత‌నిని స్టేష‌న్‌కు తీసుకుని వ‌చ్చి పై అధికారి ముందు నిల‌బెడ‌తాడు.ఇది మమ అనే విధినిర్వ‌హ‌ణ‌,మ‌న‌స్సూర్తిగి చేసే డ్యూటీకి తేడా.త‌న క్రింద ప‌నిచేస్తున్న సిబ్బందితో స‌ద‌రు ఎస్ఐ,సిఐ,డిఎస్‌పి,ఎస్పీ స్ధాయి అధికారులు వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టి,శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో వుండేది లేనిది అన్న ఆంశం ఆధార‌ప‌డి ఉంటుంది.

LEAVE A REPLY