పోలీసు కానిస్టేబుల్స్ స్టోరీ-1

0
291

అమ‌రావ‌తిః రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 965 పోలీసు స్టేష‌న్లు,50 వేల పైచిలుకు పోలీసు సిబ్బంది క‌ల‌సి 1 ల‌క్ష 65వేల 205 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల వ్యాస‌ర్ధంలోని దాదాపు 5 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను కాపాడుకుంటు వ‌స్తున్నారు.క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అయిన పోలీసు వ్య‌వ‌స్థ ఏ మాత్రం నిర్ల‌ల‌క్ష్యం వ‌హించిన‌, విధులు నిర్వహించాలి కాబ‌ట్టి నిర్వ‌హిస్తున్న‌ము అన్న చంద‌న ఉద్యోగం చేస్తే,స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పి ఆసాంఘిక శ‌క్తులు చేల‌రేగిపోతాయి.పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌కు మూల స్తంభాలు కానిస్టేబుల్స్‌.,కానిస్టేబుల్స్ పోషించే పాత్ర వ్య‌వ‌స్థ‌కు ఎంతో కీల‌కం.అలాంటి విభాగంలో నెల‌కొని వున్న చిన్న చిన్న లోపాల‌ను సరిదిద్దేంద‌కు ఉన్న‌త‌ధికారులు ఎందుకు చొర‌వ చూప‌డంలేద‌నేది ప్ర‌శ్న‌ర్ధ‌క‌మే ?
బ్రిటిష‌ర్స్ ప్ర‌వేశ‌పెట్టిన పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌లోని కొన్ని జాడ్య‌ల‌ను నేటికి ఉన్న‌త‌స్ధాయి అదికారులు కొన‌సాగించ‌డం ఆవేద‌న క‌లిగిస్తుంది.ఉద‌హ‌ర‌ణ‌కు పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌లో ఆనాధికారికంగా ఆమలు అవుతున్న ఆర్డ‌ర్ల వ్య‌వ‌స్థ‌, విధి నిర్వ‌హ‌ణ‌కు ఎంపికైన కానిస్టేబుల్స్‌,విధులు ప్ర‌క్క‌న పెట్టి,సంభంధం లేని కొన్ని హీనమైన ప‌నులు చేస్తుండ‌డం భాధించే విష‌యం.ఉన్న‌త‌స్థాయిలో వ‌చ్చే కొంత మంది అధికారులు నిజాయితీగా కానిస్టేబుల్స్‌ను వారి విధ‌లు నిర్వ‌హించేలా ప్రోత్స‌హిస్తు,వారి స‌ర్వీసులో మంచిపేరుతో మిగిలిపోతున్నారంటే అతిశ‌యోక్తికాదు.2000 వేల సంవత్సంరం త‌రువాత కానిస్టేబుల ఉద్యోగ ఆర్హ‌త 10వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్‌కు మార‌డం,అప్ప‌టి నుండి పోలీసు ఉద్యోగం కోసం ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు డిగ్రీ, పీజి చ‌దివిన‌ అభ్య‌ర్దులు ముందుకు రావ‌డం,కొంత మంది ఉన్న‌త‌ధికారులు పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్ట‌డంతో,ఆర్డ‌ర్ల విధానం ఆన‌ధికార ఆమ‌లు కొంత మేర‌కు త‌గ్గుతు వ‌స్తుంద‌ని చెప్ప‌కొవాలి.భార‌త్‌దేశం ప్ర‌మాణ‌ల ప్ర‌కారం ప్ర‌తి 547 మందికి ఒక పోలీసు వుండాలి,కాని మ‌న రాష్ట్రంలో ప్ర‌తి 910కి ఒక పోలీసు వున్నారు.అదే తెలంగాణ‌లో ప్ర‌తి 740 మందికి ఒక పోలీసు వున్నారు.అమెరికా లాంటి దేశంలో అయితే ప్ర‌తి 450 మందికి ఒక పోలీసు వున్నాట్లు గ‌ణాంక‌లు తెలుపుతున్నాయి.
1990 నుండి మోడ‌ర‌న్ పోలీసు వ్య‌వ‌స్థ ప్రారంభం అయింద‌ని చెప్ప‌కొవ‌చ్చు.కొంత మంది ఉన్న‌త‌ధికారులు సంస్క‌ర‌ణ వేగం పెంచేర‌ని చెప్ప‌కొవ‌చ్చు.అప్ప‌టి వ‌ర‌కు సామాన్య ప్ర‌జ‌లు పోలీసు స్టేష‌న్‌కు రావ‌లంటే,స‌మాజంలో త‌మ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లుగుతుంద‌ని భావించేవారు.అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్వవ‌స్థ‌లో వ‌స్తున్న మార్పుల‌ను ప్ర‌జ‌లు ఆర్దం చేసుకుని,త‌మ‌కు జ‌రిగిన ఆన్యాయంను,పోలీసుస్టేష‌న్‌కు వ‌చ్చి చెప్ప‌కొవ‌డం ప్రారంభించారు.అలా పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చిన వారిని సాద‌రంగా ఆహ్వ‌నించి,వారి స‌మ‌స్య‌ల‌ను ఆల‌కించి,త‌గు సూచ‌న‌లు చేసే రిస్పెష‌న్ విధానం ఎంత‌గానో ఆద‌ర‌ణ పొందింది.
జాతీయ ర‌హ‌దారుల‌పైన నేరం,ప్ర‌మాదం జ‌రిగింది లేదా జ‌రుగుతుంద‌ని తెలిసిన వెంట‌నే నిమిషాల వ్య‌వ‌ధిలో అక్క‌డికి చేరుకుని,ప‌రిస్థితిని ఆదుపులోకి తీసుకుని వ‌చ్చి,క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స‌కొసం ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించే హైవే పెట్ర‌లింగ్‌,ర‌క్ష‌క్‌,బ్లూకోల్స్ట్‌ విభాగ ల‌ను ఉన్న‌త‌ధికారులు నిరంత‌రం ప‌రివేక్షించ‌డంతో,మెరుగైన ఫ‌లితాలు రావ‌డంతో.ఈ విధానంలో ప‌ట్ల అన్ని వర్గాల ప్ర‌జ‌ల నుండి ప్ర‌శంస‌లు అందుకొవ‌డంతో,అధికారులు ద‌ళాల‌ను మ‌రింత మెరుగ్గ తీర్చిదిద్దేంకు నిరంత‌రం కృషిచేస్తున్నారు.

LEAVE A REPLY